E-PAPER

జీడిపప్పు వ్యాపారి అపహరణ కేసు మిస్టరీ వీడింది!

పలాస, నవంబర్ 13 (వై 7 న్యూస్):

కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీ పరిధిలో జరిగిన కిడ్నాప్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.ఈ నెల 6వ తేదీ ఉదయం పలాసకు చెందిన జీడిపప్పు వ్యాపారవేత్త వి. లక్ష్మీ నారాయణ రాజును పలాసలోని ఓ టీ షాప్ వద్ద నుండి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.పోలీసుల ప్రకారం, బాధితుడు ఆమదాలవలసలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ యజమాని. ఆ కాంప్లెక్స్‌ను పీ. వేణుగోపాలరావు అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అతని వద్ద నుండి కొంతమొత్తం డబ్బులు అప్పుగా తీసుకున్న వ్యాపారవేత్త, ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం నెలకొంది.

డబ్బుల కోసం వేణుగోపాలరావు అడిగినప్పుడు, కాంప్లెక్స్‌ను అమ్మి చెల్లిస్తాను అని లక్ష్మీ నారాయణ రాజు చెప్పినట్లు సమాచారం. అయితే, వేణుగోపాలరావు కాంప్లెక్స్ రిజిస్ట్రేషన్ నా పేరుమీద చేయి అని అడగగా, బాధితుడు నిరాకరించాడు. దీనివల్ల ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, ఆ తర్వాత కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది.

కిడ్నాప్ చేసిన వ్యక్తులు బాధితుడిని నరసన్నపేట వద్ద వదిలి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అనంతరం బాధితుడు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు కొనసాగించిన పోలీసులు బుధవారం రాత్రి పలాస బస్ స్టాండ్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్‌పీ పి. శ్రీనివాసరావు తెలిపారు.

తరువాత నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ పి. సూర్యనారాయణ, ఎస్‌ఐ ఆర్. నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News