మెదక్ జిల్లా వెల్దుర్తి నవంబర్ 13
నవంబర్ 10 న మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుక్నూరు గ్రామంలో బైక్ దహన ఘటన చోటు చేసుకుంది.అనుమానాస్పదంగా జరిగిన ఈ ఘటనపై వెల్దుర్తి పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి కేసు నమోదు చేశారు.రెండు రోజుల్లోనే సంఘటనకు సంబంధించిన అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు.కేసు దర్యాప్తు అనంతరం బనాపురం మధు తండ్రి నరసింహులు అనే వ్యక్తి బైక్ ను దహనం చేశాడని విచారణలో తేలింది.వెంటనే నిందితులనుఈరోజుఅరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దుర్తి పోలీసులు తెలిపారు.
Post Views: 346









