E-PAPER

మణుగూరులో నవంబర్ 9న మెగా జాబ్ మేళా

మణుగూరు:
సింగరేణి మణుగూరు ఏరియాలో నవంబర్ 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తెలిపారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాకు రాష్ట్రంలోని ప్రముఖ సంస్థలతో పాటు సుమారు 75 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు.

ఈ మేళా ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. సింగరేణి మణుగూరు ఏరియా పరిధిలోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం దుర్గం రామచందర్ సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News