భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న “చైతన్య డ్రగ్స్‌పై యుద్ధం” కార్యక్రమం ప్రభావంతో ప్రజల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెరుగుతోంది. ప్రజలిచ్చిన సమాచారం ఆధారంగా మణుగూరులో పోలీసులు పెద్దఎత్తున చర్యలు చేపట్టి గంజాయి నిల్వ చేసిన ఘటనను బయటపెట్టారు.
మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల చల్లా శ్రీనివాస్ (S/o నరసయ్య) ఇంట్లో గంజాయి ఉందని సమాచారం అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ గారి పర్యవేక్షణలో, ప్రభుత్వ సాక్షుల సమక్షంలో నిన్న (29.10.2025) సాయంత్రం ఐదు గంటల సమయంలో సోదాలు నిర్వహించారు.
సోదాల సందర్భంగా మొత్తం 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో శ్రీనివాస్ తన అన్నకొడుకు చల్లా సతీష్ మరియు అతని స్నేహితుడు రేపాకుల సాగర్ కలిసి సీలేరు ప్రాంతం నుండి గంజాయి తెచ్చి విక్రయిస్తారని వెల్లడించాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో గంజాయి నిల్వ ఉంచినట్లు ఆయన ఒప్పుకున్నాడు.
ఈ ఘటనపై చల్లా శ్రీనివాస్, చల్లా సతీష్, రేపాకుల సాగర్‌లపై కేసు నమోదు చేయబడింది. శ్రీనివాస్‌ను ఈరోజు రిమాండ్‌కు తరలించగా, చల్లా సతీష్ మరియు సాగర్లను ములుగు జిల్లా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఈ కార్యక్మరమంలో మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.









