వై 7 న్యూస్ పలాస:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. పాత జాతీయ రహదారిపై జీఎంఈ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో ద్విచక్ర వాహనం తీవ్రంగా దెబ్బతింది, వాహనదారుడు గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 58









