భద్రాచలం, అక్టోబర్ 29:
నఖిలీ మరణ ధ్రువపత్రం సృష్టించి, LIC నుండి రూ.10 లక్షలు మోసపూరితంగా పొందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను భద్రాచలం పట్టణ సీఐ శ్రీ ఎం. నాగరాజు ఈరోజు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం
భూక్యా శ్రీ రాములు (42), తండ్రి పేరు భాష్యా, వృత్తి కూలీ, భాస్కర్ నగర్, సారపాక (బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) నివాసి. అతని పేరుతో నఖిలీ మరణ ధ్రువపత్రం తయారు చేసి, భద్రాచలం LIC శాఖ నుండి రూ.10 లక్షలు అక్రమంగా పొందడం జరిగింది.
ఈ మోసానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినవారు:
1️⃣ భూక్యా రాధ (40), భర్త: శ్రీ రాములు, కూలీ
2️⃣ భూక్యా శ్రీ రాములు
3️⃣ భూక్యా లక్ష్మా
4️⃣ షేక్ యాకుబ్ పాషా
నిందితులను కోర్టులో హాజరు పరిచారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రమేయమున్న రాయల దుర్గా రావు సహా మరికొంతమందిని గుర్తించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ నాగరాజు వెల్లడించారు.









