E-PAPER

సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు

జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు

మణుగూరు, అక్టోబర్ 29

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) జిల్లా మహాసభల ఆహ్వాన పోస్టర్‌ను మణుగూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు సత్రపల్లి సాంబశివరావు మాట్లాడుతూ, సీఐటీయూ స్థాపననుంచి కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.

నవంబర్ 15, 16 తేదీల్లో మణుగూరులో జరగనున్న మహాసభల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై, కనీస వేతన చట్టం అమలు లేకపోవడంపై, 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌పై, మహిళా కార్మికుల రక్షణ అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు కొడిశాల రాములు, వై.సాంబయ్య, శివకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News