పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండల కేంద్రంలోని GVR ఫంక్షన్ హాల్‌లో సీతంపేట, బోటి గూడెం గ్రామాలకి చెందిన సుమారు 100 బీఆర్ఎస్ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు రుణమాఫీ, వరి బోనస్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహ జ్యోతి పథకం, ఆరోగ్యశ్రీ విస్తరణ వంటి పథకాలు ప్రజల మనసులు గెలుచుకుంటున్నాయని తెలిపారు.
కార్యకర్తలు మాట్లాడుతూ తమ గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం చూసి కాంగ్రెస్ వైపు అడుగుపెట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాధం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దాట్ల రాజేష్, బోడ రమేష్, తోలెం కళ్యాణి, బండారు సాంబశివరావు, కొర్స కృష్ణంరాజు, పాడి హేమంత్ రెడ్డి, మద్దెల సమ్మయ్య, స్వప్న, చీకటి సత్యనారాయణ, కే బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.









