E-PAPER

తాగునీటి సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలి

-తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు మామిండ్ల ఆంజనేయులు

మెదక్ వై సెవెన్ న్యూస్ అక్టోబర్ 29:

గడిచిన వారం రోజులుగా మెదక్ జిల్లా హవేళి ఘణపూర్ మండలంలోని 32 గ్రామాలకు తాగునీరు సమస్య ఏర్పడిందని మిషన్ భగీరథ నీటిని సప్లై చేసే మోటర్ సక్రమంగా పనిచేయక పోవడంతో గత వారం రోజులుగా మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు మాజీ జడ్పీటీసీ మామిండ్ల ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.మిషన్ భగీరథ మోటారును తొందరగా మరమ్మత్తులు చేయించి బిగించడానికి పట్టించుకునే పాలకులు,అధికారులు,లేక ప్రజలు తీవ్ర ఇబంధులు పడ్తున్నారనీ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారనీ తెలిపారు.కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వారం రోజులుగా తాగునీరు లేక గ్రామాలలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ అదనపు మోటార్లను,ఎమర్జెన్సీ లో ఉంచుకోవలసిన కాంట్రాక్టర్లు అధికారులు పర్యవేక్షణ చేయడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు.ఇప్పటికైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని మండల ప్రజల దాహం తీర్చాలని అధికారులను మీడియా ద్వారా కోరుతున్నారు.అలాగే త్వరలోనే మాజీ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి సహకారంతో జిల్లా కలెక్టర్ ను హవేలీ ఘనపురం తాగునీటి సమస్యపై ఫిర్యాదు చేస్తామనీ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News