వై7 న్యూస్ పలాస:
అర్జిదారుల సమస్యలను చట్టపరమైన పరిధిలో పరిశీలించి పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సూచించారు.
శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రజా పిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు సత్వరంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతి పిర్యాదు దారునికి న్యాయం జరిగేలా చూడడం మన బాధ్యత” అని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను సత్వర పరిష్కార దిశగా తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.
Post Views: 53









