మణుగూరు: బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం బీసీ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఈ నెల 18వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. బంద్‌కు వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆర్టీసీ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.
బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ—
“మా బీసీ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. బీసీ హక్కుల కోసం అందరూ ఏకతాటిపైకి రావడం ఆనందదాయకం. ఈ బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా మన బలాన్ని రాష్ట్రానికి చాటుదాం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు జీవి, పెనుగొండ సాంబశివరావు, నాగారపు సతీష్, మహిళా నాయకురాలు బింగి రమాదేవి, బెక్కం జయమ్మ, ప్రచార కమిటీ నాయకురాలు బొల్లు నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.









