పినపాక మండలంలో గత రాత్రి కురిసిన వర్షానికి చేతికందిన వందల ఎకరాల వరి పంట నేలమట్టమైంది. కోతకొచ్చిన వరిపొలాలలో ప పండిన పంటలో వడ్లు రాలి అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు. గోపాలరావుపేట గ్రామంలో బండగొర్ల మల్లేష్ అనే రైతు తన 6 ఎకరాల వరిని మంగళవారం మిషన్ తో కోత కోపించాడు. రాత్రి కురిసిన వర్షానికి దాదాపుగా 200 బస్తాల ధాన్యం నీట తడిచింది. వందల ఎకరాల చేతికి వచ్చిన పంట నేల మట్టమై రైతుల కళ్లలో కన్నీటి వాన కురిపించింది.
Post Views: 59









