బూర్గంపాడు, సెప్టెంబర్ 09 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బిఎన్‌ఆర్ విద్యా సంస్థల అధినేత బిఎన్‌ఆర్‌కు గురుబ్రహ్మ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం సాయంత్రం ఐటీసీ అతిథి గృహంలో బిఎన్‌ఆర్ అధినేతకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు కూడా బిఎన్‌ఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 94









