పాల్వంచ సెప్టెంబర్10 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కేశవాపురం–జగన్నాధపురం గ్రామాల ఉమ్మడి గ్రామదేవతగా పేరుగాంచిన పెద్దమ్మ తల్లి దేవస్థానం భక్తుల ఆధ్యాత్మిక నమ్మకానికి కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఇక్కడ జరిగే జాతర విశేష వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఈ సంవత్సరం దసరా జాతర 22-09-2025 నుండి 02-10-2025 వరకు వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. స్థానిక ఆలయ కమిటీ సభ్యులు, గుడి సిబ్బంది కలిసి భూమి పూజలు నిర్వహించి ఉత్సవాలకు శుభారంభం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి గుడి ఈవో, ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల జైజయకారాలతో మార్మోగింది.
భక్తులు ఈ సందర్భంగా “అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్: ఎం జ్యోతి









