వై 7 న్యూస్, పలాస ఆగస్ట్ 3
పలాస పట్టణంలోని కేటీ రోడ్డుపై స్టైల్ బజార్ పక్కన ఉన్న శ్రీనివాస ట్రేడర్స్ కిరాణా హోల్సేల్ షాపులో ఆదివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది.ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని తెలుస్తోంది. వారిలో ఒకరు షాపు బయట నజర్ వేస్తూ ఉండగా, మరొకరు షాపులోకి చొరబడి కౌంటర్ తాళం పగలగొట్టి నగదు చోరీ చేశారు. దొంగలు మొత్తం రూ.33,460 నగదు అపహరించినట్లు షాపు ఓనర్ మల్లకృష్ణారావు తెలిపారు.పలాస కాశీబుగ్గ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానిక వ్యాపారవేత్తలలో భయాందోళనకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో సహా పరిశీలనలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Post Views: 56