ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసి చైర్మన్ పాయం సత్యనారాయణ
చర్ల, జులై 30 వై 7 న్యూస్;
చర్ల మండలం బుధవారం నాడు సుందరయ్య కాలనీలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇర్ప ప్రకాష్ దొర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసి చైర్మన్ పాయం సత్యనారాయణ దొర మాట్లాడుతూ,మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రైమరీ విద్యాభ్యాసం 1970 సంవత్సరం, ముందు, స్కూల్ రికార్డులో ఏ కులము హోదాలో చదువును అభ్యసన చేశారో బహిర్గత పర్చాలి అని,పాయం డిమాండ్ చేశారు.1976 సంవత్సరం తర్వాత ఓన్లీ DNT హోదాలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్య అవకాశం కల్పించింది నిజం కాదా?1976 సంవత్సరం నుండి ST, 6 శాతం మరియు ఏజెన్సీ ప్రాంత 2000 సంవత్సరం నుండి 100% రిజర్వేషన్ మెజార్టీ వర్గంగా విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల అవకాశాలు లబ్ధి పొందింది నిజం కాదా? భద్రాచలం ఎమ్మెల్యే ఆదివాసి ముద్దుబిడ్డ డా. తెల్ల వెంకటరావు పై కక్షపూరితంగా ఆరోపణలు చేయటం, ఆదివాసి సమాజం సహించదని అన్నారు, రిజర్వేషన్ల హక్కులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.ముఖ్యంగా భారత రాజ్యాంగం ఐదో షెడ్యూలు 1950 తెలంగాణ రాష్ట్రంలో 9 ఆదివాసి తెగల కు దక్కవలసిన విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో ఆదివాసి సమాజం వెనుకబడి ఉన్నదని. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల ఫలాలు నిజమైన అర్హులకు అందించడంలో కోసం విప్లమయ్యారని,బరాబర్ గా ఆదివాసి హక్కుల కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం. వరప్రసాద్ పాలెం. నాగరాజు ఇర్ప. అరుణ్ కుమార్ పర్శిక. రాజు కారం. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.