కరకగూడెం, జూన్ 11 (వై7 న్యూస్):
బుధవారం సాయంత్రం కరకగూడెం మండలంలోని రాళ్లవాగు వద్ద ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పద్మాపురం గ్రామానికి చెందిన గోవిందరావు, పినపాక మండలంలోని గోవిందాపురానికి చెందిన వ్యక్తి గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 2,380









