E-PAPER

అమ్మ మాట అంగన్వాడి బాటను విజయవంతం చేయాలి – జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనీనా

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 9: ఈనెల 10 నుండి 17వ తేదీ వరకు జరగబోయే “అమ్మ మాట అంగనవాడి బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా సూచించారు. అంగన్వాడి కేంద్రాలను ఆకర్షణీయంగా తయారు చేయడం, తల్లిదండ్రులతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం, శుభ్రత, పోషణ వాటికలు, అవగాహన ర్యాలీలు, సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాల్సిన అంశాలుగా పేర్కొన్నారు. అలాగే, మంచి హాజరుతో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు ప్రోత్సాహక బహుమతులు, 3 ఏళ్లు పైబడిన పిల్లల హాజరుపై ప్రత్యేక దృష్టి, “ఇందిరమ్మ అమృతం” పథకం ద్వారా కిశోర బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News