భద్రాచలం, మే 28 (వై 7 న్యూస్):
దుమ్ముగూడెం మండలం గడ్డూరిగట్టు గ్రామానికి చెందిన 25 ఆదివాసీ కుటుంబాలు తమ 49 ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వాలని మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇచ్చాయి. సర్వే చేసి ఆర్ఓఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ చేసినా అధికారులు పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫారెస్ట్ అధికారులు అక్రమంగా టేకు చెట్లు నరికి కేసులు పెడుతున్నారని న్యూడెమోక్రసీ నేతలు తెలిపారు. భూములపై హక్కును అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ నాయకులు మట్ట నరసింహారావు దుర్గమ్మ దుర్గమ్మ లక్ష్మీ రాంబాయి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 287









