E-PAPER

బీటీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయ్యాలి;సామాజిక కార్యకర్త, లాయర్ కర్నే రవి

మణుగూరు,మే07

మణుగూరులో ప్రజా సమస్యలను తీర్చడంలో సామాజిక కార్యకర్త కర్నే రవి ముందుంటున్నారు. జీవో నెంబర్ 68 కింద మంజూరైన బీటీ రోడ్డుల పనులు ప్రారంభించే విధంగా కృషి చేయాలని మణుగూరు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం గిరి సంక్షేమ డిపార్ట్మెంట్ ద్వారా బీటీ రోడ్డు పనులు మంజూరయ్యాయని ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారు అని మణుగూరు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కు తెలియజేశారు. పివి కాలనీ నుండి రేగులగండి వరకు 1కోటి 35 లక్షలు మంజూరయ్యాయని, ఎస్సిసిఎల్ రోడ్డు నుండి వాగు మల్లారం వరకు 1 కోటి 27 లక్షల రూపాయలు, పగిడేరు నుండి సమ్మక్క సారలమ్మ గుడి వరకు 1కోటి 27 లక్షలు, యుపిఎస్ కూనవరం నుండి ఏనికసర్వాయిగుంపు వరకు 1కోటి 87 లక్షల రూపాయలు, రైల్వే స్టేషన్ మణుగూరు నుండి రాయన్నపేట వరకు 75 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఏడాది క్రితమే మంజూరైన ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని దీనికిగాను జిల్లా కలెక్టర్ త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అదే విధంగా మణుగూరు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఈ సందర్భంగా కర్నే మాట్లాడుతూ త్వరితగతిన రోడ్లను పూర్తి చేసి ప్రజాభివృద్ధికి పాటుపడాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News