మణుగూరు , మే 07 వై 7 న్యూస్;
వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి జయంతి సందర్భంగా మణుగూరు వాసవీ క్లబ్, వనితా వైభవం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. గుట్టమల్లారం లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో అమ్మవారికి పంచామృతాభి షేకం నిర్వహించి అనంతరం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజారి ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దోసపాటి నాగేశ్వర రావు, మణుగూరు వాసవీ క్లబ్ ప్రతినిధులు శ్యామ్, బొగ్గవరపు అంజలి, IPC బండారు నర్సింహారావు, జిల్లా పీ ఆర్ ఓ కడవెండి విశ్వనాథ గుప్తా, జిల్లా జాయింట్ సెక్రటరీ శేషుబాబు, దోసపాటి స్వర్ణ, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు చిత్తలూరి రమేష్ బాబు, జిల్లా ఆర్య వైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు ఉమ, నాగరత్న మణి, వడియాల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.









