మణుగూరు ఏప్రిల్ 25 వై7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో బీ టీ పీ ఎస్ కాంట్రాక్ట్ కార్మికులు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వలన డ్రైవర్ ల జీతభత్యాలు లారీ మెయింటినెన్స్ ఇతరత్రా ఖర్చులు భారమైనందున శుక్రవారం ఉదయం మణుగూరు నుండి బిటిపిఎస్ కు సరఫరా చేసే 14 టైర్ల లారీలు 110 బండ్లను సంబంధించిన 63 మంది లారీ ఓనర్లు లారీలను నిలుపుదల చేశారు. దాదాపు రెండు కోట్ల బాకీలు ఉన్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హామీ మేరకు సమ్మెను విరమించినట్టు యూనియన్ నాయకులు తెలిపారు.
Post Views: 126









