E-PAPER

టిడిపి సభ్యత్వ కార్డులు పంపిణీ

మణుగూరు, ఏప్రిల్ 25 వై న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ కార్డులు అందజేత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచంద్రరావు పాల్గోని తెదేపా నాయకులకు బూతుల వారిగా నియోజకవర్గంలో గల నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు.ఈసందర్భంగా అయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో సభ్యత్వలు నమోదు చేపట్టడం జరిగిందని, ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసం ఉంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల,పట్టణ,గ్రామ, వార్డు స్థాయిలో గల నాయకులందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీని పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ఆయన కోరారు. పార్టీ సభ్యత నమోదు తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నియోకవర్గ నేత వట్టం నారాయణ దొర మండల నాయకులు మల్లిడి లోకేష్, ఉప్పలపాటి రాంబాబు,రాజా,ముమ్మినేని సత్యనారాయణ, పూర్ణ , జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, బచ్చల సుమేష్ పొగాకు వెంకటేశ్వర్లు, మల్లయ్య, మహిళా నేతలు కమూరనిషా బేగం, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్