కరకగూడెం,ఏప్రియల్ 09, వై 7 న్యూస్ తెలుగు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా గొల్లగూడెం గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రేషన్ బియ్యం ఎవరు అమ్ముకోవద్దని వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. అనంతరం గొల్లగూడెం గ్రామానికి చెందిన సన్న బియ్యం లబ్ధిదారురాలు ముండ్రాతి అనసూర్య నివాసంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి తహసిల్దార్ నాగప్రసాద్ సన్నబియ్యంతో వడ్డించిన భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 260









