మణుగూరు :ఈనెల 25వ తేదీన మణుగూరు లో జరిగే ఏఐఎస్ఎఫ్ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ను జయప్రదం చేయాలని మండల కేంద్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.విద్యార్థులలో సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు, ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక ధైర్యాన్ని పెంచుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ ఆర్గనైజింగ్ కార్యదర్శి వరక అజిత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఇనపల్లి పవన్ సాయి , మండల నాయకులు అక్కిన పల్లి నాగేంద్ర బాబు రాజు అలోక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 50