కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే బర్థ్అఫ్ చేయాలి
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వెలువెత్తిన నిరసన కార్యక్రమాలు
కాసీపేట రాజేశం
సిఐటియు నస్పూర్ మండల కన్వీనర్
నస్పూర్,డిసెంబర్26 వై 7 న్యూస్;
పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికే మాయని మచ్చగా, బహుజనుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన అమిత్ షాను వెంటనే భర్త చేయాలని, దేశ బహుజన ప్రజలకు రాజ్యాంగానికి క్షమాపణలు చెప్పాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నస్పూర్ మండలంలో ఎస్ఆర్పి ఓసిలో సిఐటియు ఆధ్వర్యంలో ఫ్ల కార్డులతో నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా కాసిపేట రాజేశం సిఐటియు మండల కన్వీనర్ మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రతి విషయంలో మనస్ఫృతిని రాజాధికారంలోకి తేవాలనే తపనతో పని చేస్తుంది. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో రాజ్యాంగం పై జరుగుతున్న చర్చలో భాగంగా స్వయాన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అంబేద్కర్ ను అపహాస్యం చేసే విధంగా వాక్యాలు చేయడం అంటే ఈరోజు అధికారంలో కొనసాగడానికి ఆ రాజ్యాంగమే మూల కారణమని విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడడం రాజ్యాంగాన్ని, అంబేద్కర్ నే కాదు దాన్ని గౌరవించే బహుజన ప్రజలందరినీ అవమానించడమే. బేషరతుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి, బహుజన ప్రజలకు, రాజ్యాంగానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. అంతేకాకుండా వెంటనే తన పదవి నుండి బర్తఫ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి, జైలుకు సైతం పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల బహుజనుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన అంబేద్కర్ కొరకు ప్రజా పోరాటాలను సైతం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు డివిజన్ కార్యదర్శి గట్టు మహేందర్, నాయకులు సతీష్, సంపతి, రమేష్, సురేష్, శీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.