బూర్గంపాడు డిసెంబర్ 24 వై సెవెన్ న్యూస్;
సారపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ కు సమ్మె నోటీసు అందజేశారు.కార్మికుల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 27,28 తేదీలలో జరిగే టోకెన్ సమ్మె జయప్రదం చేయాలని C.I.T.U ఎ.జె.రమేష్,జిల్లా కార్యదర్శి. పిలుపునిచ్చారు.గత సంవత్సర కాలంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు సమస్యలను పరిష్కరించాలని పడే పడే వినతి పత్రాలు ఇచ్చినా,దశల వారీగా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని అన్నారు.ఈ నెల 17 వ తేదీన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైద్రాబాద్ కార్యక్రమం నిర్వహించగా,ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి,వెంటనే అనుమతిని రద్దు చేసారని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు లు చేశారని,గృహ నిర్భంధం చేశారని అన్నారు.ఇంతటి నిర్బంధాన్ని సైతం ఎదిరించి వేలాది మంది కార్మికులతో చలో హైద్రాబాద్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని,దీనితో ఈ నెల 27,28 తేదీలలో రెండు రోజుల పాటు టోకెన్ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా JAC పిలుపునిచ్చారని అన్నారు.టోకెన్ సమ్మె తోనైనా ప్రభుత్వం స్పందించాలని,లేని యెడల జనవరి 5 వ తేదీ తర్వాత నిరవధిక సమ్మె కి వెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు,గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు సురేష్,యాకుబ్,వెంకన్న, రోషమ్మ , సునీత, జన్మియా,రాధ తదితరులు పాల్గొన్నారు.