కాజీపేట రాజేశం కన్వియన్స్ డ్రైవర్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు
మందమర్రి,డిసెంబర్14 వై 7 న్యూస్;
మందమర్రి డివిజన్ పరిధిలోని ఏరియా వర్క్ షాప్ లో కన్వెయన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న సంతోష్ అనే డ్రైవర్ని టెండర్ మారిందని నేపం తో విధుల నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత ఆరు సంవత్సరాల నుండి సంస్థలో ఎంతో నమ్మకంతో పనిచేస్తున్న కార్మికున్ని ఎలా తీసివేస్తారని అధికారులను ప్రశ్నించారు. కంపెనీ పరంగా డ్రైవర్ కు ఉండాల్సిన మెడికల్, విటిసి, సీఎం పిఎఫ్ నెంబర్ తదితర నిబంధన ప్రకారంగా పనిచేస్తున్న డ్రైవర్ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అకారణంగా తొలగించడం ఆ కుటుంబాన్ని రోడ్డున పాలు చేయడమే అవుతుందని,అధికారులు సానుకూలంగా స్పందించి తొలగించిన డ్రైవర్ను వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల ఆ డ్రైవర్ కు మద్దతుగా కన్వియన్స్ డ్రైవర్లు అందరు కూడా నిరసన, ఆందోళన పోరాటాల్లో సైతం పాల్గొంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సతీష్, సురేష్, రాజకుమార్, సల్లూరి సురేష్, వినయ్, మల్లేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.









