మణుగూరు,డిసెంబర్ 06 వై 7 న్యూస్;
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ టెలిఫోన్ ఎక్సేంజ్ వెనకాల ఎయిర్ టెల్ టవర్ నిర్మాణాన్ని గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు..మాజీ జడ్పీటీసీ పోషం నరసింహారావు సంబంధించిన భూమిలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారన్న సమాచారంతో గ్రామస్తులు అందరూ టవర్ నిర్మానం చేపడుతున్న ప్రాంతానికి వెళ్లి టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు.. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జనావాసాల మధ్యలో టవర్ నిర్మాణం చేపడుతున్నారని ,అనుమతులు రద్దు చేయాలని, టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని కోరారు.
Post Views: 220