పిట్లం డిసెంబర్06 వై సెవెన్ న్యూస్ తెలుగు
పిట్లం మండల కేంద్రంలో సాయి గార్డెన్ లో గురువారం శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి బీమా చేసుకోవాలని బీమాతో కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. కారేగాం గ్రామానికి చెందిన వడ్త్య బుజ్జి కి 17 లక్షల 56000 చెక్కు, కంగిటి గ్రామానికి చెందిన కరీయాబి కి 8 లక్షల 56000 చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ జిఎమ్ సతీష్, మేనేజర్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 31