దద్దమ్మ ప్రభుత్వం, పాలన బి ఆర్ యస్ దే
నీ పాలన అంత మోసపూరిత జివోలు, శిలాఫలకాల ప్రారంభోత్సవాలు
మణుగూరు, డిసెంబర్ 3 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన సమావేశం లో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ మాట్లాడుతూ అభివృద్ధి నీ చూసి ఓర్వలేకనే విజయోత్సవ సంబరాల మీద అక్కసు వెళ్లబుచ్చుకోవడం నీతిమాలిన పని అని,రైతులు వరి పండిస్తే ఉరే అన్న మీ పాలనకు రైతే రాజు అని రైతు రుణమాఫీ రైతు బోనస్ ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. దౌర్జన్యాలు కబ్జాలు కాలి జీవోపత్రాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడానికి శిలాఫలకాలు కట్టి ప్రారంభోత్సవాలు చేసిన ఘనత నిది అందుకే మిమ్మల్ని ప్రజలు దద్దమ్మ పాలన దద్దమ్మ ప్రభుత్వం వద్దని పక్కకు పెట్టి సంవత్సరకాలం పూర్తయిందన్నారు. సంవత్సరం లో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని మీరు నాలుగు సంవత్సరాల తర్వాత గెలుస్తాం అనడం విడ్డూరంగా ఉంది అని, నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసమైన పద్ధతి కాదన్నారు. గడిచిన కాలంలో పార్లమెంటు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తోనే నాలుగు నెలల కాలం పాలనకు దూరంగా ఉన్న అభివృద్ధిలో వెనకడుగు వేయని దమ్మున్న నాయకుడు పాయం అని, వారి నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతుంటే ఓర్చుకోలేక ఉనికిని కాపాడుకోవడం కోసం నిరాదరమైన ఆరోపణలు చేస్తూంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఎవరు అభివృద్ధి ఏంటో ఎవరి దమ్ము ఏంటో ఎవరు దద్దమ్మలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ లో తెలుసని, రాబోవు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పాయం నాయకత్వం సత్తా ఏంటో నిరూపిస్తాం అన్నారు. కాంగ్రెస్ కార్యాలయం కబ్జా చేసి బిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టిన మీకు ఎమ్మెల్యే పాయం ని విమర్శించే నైతికత లేదు అని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బోనగిరి శివ సైదులు, నాయకులు తలమంచి సుబ్బారెడ్డి, కూచుపూడి బాబు,పొలామూరి రాజు,గుడిపూడి కోటేశ్వరరావు, పాతూరి వెంకన్న,గాండ్ల సురేష్, మహిళా అధ్యక్షురాలు కూరపాటీ సౌజన్య, త్రిమూర్తి,యాకుబ్ అలీ, వెంకట్రావు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు