E-PAPER

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమగ్ర విచారణ జరపాలి

సర్వేలో ఇంటి నెంబరు తొలగించాలి

ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో ఆర్డిఓ విచారణ జరపాలి

చర్ల,డిసెంబర్03 వై 7 న్యూస్

చర్ల మండలంలో లక్ష్మీ కాలనీ ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమగ్ర విచారణ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు అన్నారు. కామ్రేడ్ బిఎస్ రామయ్య భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కొరకు ఇచ్చిన ఇళ్లను కొంతమంది ప్రతినిధులు దళారులు అమ్ముకోవడం సరైన విధానం కాదని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఇండ్లకు అమ్మకానికి అనుమతి ఎవరిచ్చారని కరెంటు మీటర్లు ఎలా వచ్చాయని అమ్మకాలు జరిపిన వ్యక్తులపై కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తుల అమ్ముకోవడం దురదృష్టకరమని ఇందులో గతంలో ప్రజాపతి నిధులు హస్తం ఉన్నదని దీనిపై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ సర్వే లో వారి యొక్క వివరాలు నమోదు చేయకుండా నిలిపివేయాలని దీనికి పూర్తిస్థాయిలో అధికారులు సహకరించాలని గతంలో కూడా సిపిఎం పార్టీగా మండల తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసినామని కానీ స్పందించే పరిస్థితి లేదని కావున ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి అమ్మకం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేసి అసలైన పేదలకు ఇండ్లను పంపిణీ చేయాలని అన్నారు దీనికి ప్రత్యేకంగా భద్రాచలం ఐటిడిఏ పిఓ మరియు ఆర్డిఓ ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ విషయంలో జోక్యం చేసుకొని విచారణ చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కారం నరేష్ బందెల చంటి అమర్ బాలాజీ పొడుపు గంటి సమ్మక్క దొడ్డి హరి నాగ వర్మ బి నవీన్ షారోన్ వరదల వరలక్ష్మి పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :