బీర్కులు నవంబర్ 20వై న్యూస్ తెలుగు
బీర్కూరు మండల కేంద్రంలోని
కార్తీక మాసం పురస్కరించుకొని బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి . కార్తీక మాసం అంటేనే దీపోత్సవం. మహిళలు దేవాలయాల్లో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. బీర్కూర్ పిఎస్ఆర్ కాలనీలో వెలసిన కొఠారి మైసమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి 11 వేల దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఏటా మహదేవ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. మంగళవారం మహదేవ్ మహారాజ్ కొఠారి మైసమ్మ ఆలయం వద్ద 11వేల దీపాలను వెలిగించి దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. దీపోత్సవం కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు తరలివచ్చారు.
Post Views: 35