E-PAPER

గ్రామ గ్రామాన ఆత్మగౌరవం కోసం ముందడుగు వేసిన మాలలు

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ దగ్గుపాటి బాబురావు

హుజూర్ నగర్,నవంబర్ 19 వై 7న్యూస్;

హుజూర్ నగర్ నియోజకవర్గము గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం లో, మాలల నూతన కమిటీ కొరకు గ్రామ గ్రామంలో ఉన్న మాలలను కలిసి చైతన్యపరుస్తున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ దగ్గుపాటి బాబురావు. వారిని కలిసిన సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలు మౌనం విడి తమ ఆత్మగౌరవం కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని దానికి తగినట్టుగా గ్రామ గ్రామాన చైతన్య పరుస్తూ ఐక్యత చేస్తూ తమ ఆత్మగౌరవం కోసం పోరాడాలని మంచితనమని ఎవడో రాజకీయ అవసరానికి కొంతమందిని బలి చేస్తూవుంటే చూస్తూ ఊరుకుంటానికి ఎస్సీలము ఏమి బలి పశువులము కాదని,మాల అంటే చైతన్యానికి మంచితనానికి మారు పేరు తప్ప చేతకాక చేతులు ముడుస్తున్న జాతి కాదు అని అన్నారు.నిండుకుండల ఉన్న ఎస్సీలను ముక్కలు చేసి నాయకులు వారి స్వార్థాల కొరకు వారి పబ్బాలు గడుపుకోవటం కోసం అమాయకుల్ని బలి చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ గొట్టేముక్కుల రాములు, మాడుగు దశరథ్ , గొట్టేముక్కుల అశోక్. రాజు, కోల్లపూడి ప్రవీణ్, కామల్ల రాజా, ఇట్టి మల్ల వినోదు, గొబ్బి రాము,బొల్లెద్దు అరుణ్,వెలిదండ మాల పెద్దమాల అంతోని,కోటేశ్వరరావు,రాంబాబు, చౌరీ,పెంటయ్య,కిరణ్,రాములు,శీను,రవి,నరసయ్య,జానయ్య,వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, జయరాజు,తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News