E-PAPER

హాస్టల్ వార్డెన్ పై ఎమ్మెల్యే పాయం ఫైర్

చిరుమల్ల ఆశ్రమ బాయ్స్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీలు చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం

విద్యార్థులకు ఉన్నత చదువు పోషక ఆహారం అందించాలి ఎంఎల్ఏ పాయం

కరకగూడెం,సెప్టెంబర్30 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా చిరుమల్ల ఆశ్రమ బాయ్స్ హైస్కూల్ ని ఆకస్మిక తనిఖీలు చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం. అనంతరం విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలను మరియు అల్పాహారం మరియు భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు హాస్టల్ లో భోజనం లో పురుగులు వస్తున్నాయని, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వలన నాసిరకం భోజన సదుపాయం అందుతుందని తెలియజేశారు. ఎం ఎల్ ఏ పాయం వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు. విద్యార్థులకు ఎటువంటి లోటు వచ్చిన వార్డెన్స్ పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులకు ఉన్నతమైన విద్య పోషక ఆహారాలను అందించాలని హాస్టల్లో ఏదైనా సదుపాయాలు కావాలంటే నా దృష్టికి తీసుకురావాలని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :