E-PAPER

పిట్టల రాలిపోతున్న గురుకుల సంక్షేమ హాస్టల్ల విద్యార్థులు

. పేరుకే సంక్షేమం అంతా సంక్షోభమే

. బుక్కెడు బువ్వ కోసం అమ్మ ఒడిని విడిచి ఆస్పత్రిల పాలు అవుతున్న విద్యార్థులు

. ఏ ఐ ఎస్ బీ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్

బీర్కూర్ సెప్టెంబర్ 30 వై సెవెన్ న్యూస్ తెలుగు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా;తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లు,కేజీవీబీ హాస్టళ్ల నిర్వహణ చాలా అద్వానంగా తయారైందని,విద్యార్థులకూ కనీస రక్షణ కరువైందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ బీర్కూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో అన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టలల్లో విద్యార్థులకూ జ్వరాలు వచ్చిన వారి ఆరోగ్యాలు బాగాలేకున్నా కనీసం పట్టించుకునే వారే దిక్కులేరాని,వారు తినే అన్నంలో పురుగులు,బొద్ధింకలు,బల్లులు,
రోజుకో హాస్టళ్ళల్లో వస్తున్నా సంఘటనలు చూస్తూనే ఉన్నామాని ఆయనఅన్నారు.సరిపడా గదులు,నీరు, బాత్రూంలు లేకపోవడం,ఉన్న వాటిని ప్రతి రోజు శుభ్రం చేయకపోవడం వలన విద్యార్థులుచాలాఅవస్థలకుగురవుతున్నారని,మరియు డెంగ్యూ,మలేరియా,టైపాడ్ జ్వరాలు వస్తే కనీసం ట్యాబ్లేట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.పూడ్ పాయిజాన్ అయ్యి హాస్పిటలల్లోకి విద్యార్థులు చేరితే మళ్ళీ తిరిగి హాస్టళ్ళల్లోకి వస్తారా రారా అనే భయందోళనలలో విద్యార్థులతల్లి,తండ్రులు ఉన్నారని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో హాస్టలల్లో ఉండే విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నారని,మరణ మృదంగాలుగా,చావు డప్పుల మొతలుగా అయితునాయని,బుక్కెడు బువ్వకోసం అమ్మ ఓడిని విడిచి హాస్టలల్లో ఉండి ఆస్పత్రుల పాలు అవుతున్న కనీసం స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు.గత నేలలో గురుకుల హాస్టళ్ళల్లో ఐదుగురు విద్యార్థులు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితులల్లో లేదు అంటే పేద మధ్యతరగతి విద్యార్థుల ప్రాణాలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వనికి కొద్దిగా అయినా పట్టింపులేదూ అనే విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. ఇట్టి సమస్యలనూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి చనిపోయిన విద్యార్థుల తల్లీ,తండ్రుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :