నిజాంసాగర్ సెప్టెంబర్ 30 వై 7 న్యూస్ ప్రతినిధి
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ,నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిధిలావస్థకు చేరుకున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని మరమ్మత్తులు చేయించుకోవాలని స్థానిక ఎస్సై సుధాకర్ కు ఆదేశించారు జిల్లా ఎస్పీ సింధు శర్మ. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. నేరాలు నియంత్రించడానికి రాత్రి వేళలో పెట్రోలింగ్ విస్తృతంగా చేయాలనీ సూచించారు, దొంగతనాలు అరికట్టాలని, సీసీ కెమెరాలు పెట్టుకునేలా ప్రజలను అవగాహన కల్పించాలని ఎస్సై కి సూచించారు. నేరాలు అరికట్టడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ తో పాటు బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ, స్థానిక ఎస్సై సుధాకర్ ఉన్నారు .
Post Views: 61