అశ్వాపురం, సెప్టెంబర్ 23 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ 95 96 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కేకే ఫౌండేషన్ కొర్లకుంట కిషోర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అశ్వాపురం గ్రామపంచాయతీలో గల 22 మంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను వర్షపుకోట్లను అశ్వాపురం సిఐ కూడా అశోక్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశ్వాపురం సిఐ గూడా అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారుజామునే ఐదు గంటలకు లేచి వీధిలోకి వెళ్లి ప్రతి రోడ్లను శుభ్రం చేస్తూ, రాత్రి 9 10 గంటల వరకు వారు నిరంతరము ఎండా వాన లేకుండా పనిచేస్తుంటారని ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా వారి సేవలను కొనియాడుతూ పారిశుద్ధ్య కార్మికులను వారు ప్రజలకు చేస్తున్న సేవలను సీఐ అశోక్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కొర్లకుంట కిషోర్ చేస్తున్నటువంటి సమాజ సేవలను ఆయన అభినందించారు. కరోనా సమయంలో కూడా మీరు అశ్వాపురం మండల ప్రజలకు చేస్తున్న సేవలు భవిష్యత్తులో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎంపీడీవో వరప్రసాద్ , ఈ ఓ ఆర్ డి ముత్యాలరావు, గ్రామపంచాయతీ సెక్రటరీ మల్లేష్, వరలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేత వేములపల్లి రమేష్ కొర్లకుంట నరేష్ తదితరులు పాల్గొన్నారు..