E-PAPER

నాగారం చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాలి .జిల్లా కలెక్టర్ పాటిల్ కు రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల వినతి

కొత్తగూడెం,సెప్టెంబర్ 14 వై 7 న్యూస్;

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాల్వంచలోని కొన్ని ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయనీ ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని వారిని అధికారులు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొత్వాల కలెక్టర్ ను కలిసి సమస్యలు వివరించారు. గత సంవత్సరం వర్షాలతో పాల్వంచ మండలంలోని నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయిందని, చెక్ డ్యాం లేకపోవడం వలన ఇటీవల వర్షాలతో రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేశాయన్నారు. వందలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని వారికి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఒడ్డుగూడెం ప్రాంతంలో గృహలలో నీరు నిలిచి, ఇళ్లు దెబ్బతిన్నాయని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన ఉల్వనూరు, చుట్టు ప్రక్కల గ్రామాలలోని ఇళ్ళు తీవ్ర వర్షాలతో దెబ్బతిన్నాయనీ, వాటిని గుర్తించి 52 ఇండ్లకు ఒక్కొక్కరికి 16,500/- చొప్పున నష్ట పరిహారం ఇచ్చినందుకు ప్రభుత్వానికి కొత్వాల కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర వర్షాలతో జిల్లా మొత్తం వరదలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో జిల్లా కలెక్టర్, అధికారులు అమోఘంగా పని చేసారనీ, వారికి కొత్వాల.కృతజ్ఞతలు తెలిపారు.

కలెక్టర్ కు కొత్వాల సన్మానం
జిల్లా సమస్యలపై స్పందిస్తూ, వాటి పరిష్కారానికై నిత్యం కృషి చేస్తున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కొత్వాల శాలువా, బొకేలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కొత్వాల తో పాటు పాల్వంచ మాజీ జడ్పిటిసి. యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై.వెంకటేశ్వర్లు లు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News