మిర్యాలగూడ, సెప్టెంబర్ 14 వై 7 న్యూస్;
అజాగ్రత్త తో టిప్పర్ నడిరోడ్డుపై నిలిపి ఉంచడం వలన వెనకనుంచి వచ్చిన అంబులెన్స్ గట్టిగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం తెల్లవారుజామున మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన సునీత గతవారం రోజుల క్రితం నెల్లూరు బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో డయాలసిస్ కోసం చొక్కా శివకుమార్, సుబ్బమ్మ, కొండేటి సునీల్ తో కలిసి అంబులెన్స్ లో డ్రైవర్ తో కలిపి మొత్తం ఐదుగురు నెల్లూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. కాగా మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలోకి రాగానే అజాగ్రత్తగా టిప్పర్ ను నడిరోడ్డుపై నిలిపి ఉంచడంతో అంబులెన్స్ వేగంగా వచ్చి టిప్పర్ వెనక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో నెల్లూరుకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మధ్యాహ్నం రాకేష్ (24) అక్కడికక్కడే మృతి చెందగా, డయాలసిస్ పేషెంట్ సునీతకు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించి, మిగిలిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సు ను బయటకు తీయడం కోసం జెసిబి ఉపయోగించినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న అంబులెన్స్.









