హుజూర్నగర్, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్
భారత కమ్యూనిస్టు పార్టీ హుజూర్నగర్ పట్టణ సమితి విస్తృత కౌన్సిల్ సమావేశం మామిడి వెంకయ్య అధ్యక్షతన సోమవారం నాడు స్థానిక హనుమాన్ లింగయ్య భవన్లో జరిగిందిఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నట్లు వారన్నారు. సూర్యాపేట జిల్లా కు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఎంతోమంది మహనీయులు దేవులపల్లి వెంకటేశ్వరరావు,భీమిరెడ్డి నరసింహారెడ్డి, దొడ్డ నర్సయ్య అనేకమంది మహనీయు కన్న గడ్డ ని అభివర్ణించారు. హుజూర్నగర్ ప్రాంతంలో చింతలమ్మ గూడెం దగ్గర ఈ ప్రాంత తొలి అమరులు దొంతి రెడ్డి షంబిరెడ్డి, మిల్ట్రీ గోపయ్య, దాసరి లింగన్న అని వారు తెలియజేశారు. ఈ ప్రాంతంలో చింతలపూడి రాములు గారితో పాటు అనేకమంది పోరాట యోధులు ఆనాటి పోరాటంలో పాల్గొన్నారు అని తెలియజేశారు. నాడు భూమి కోసం భుక్తి కోసం ఈ ప్రాంత ఈముక్తి కోసం జరిగిన పోరాటం నేటికీ భూ సమస్య పరిష్కారం కాలేదని, దున్నేవానికి భూమి కావాలని, వారన్నారు.ధరణి పేరుతో జరుగుతున్న రికార్డులను సరిచేసి రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లాలో మూడు రోజులపాటు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జాత నిర్వహించినట్లు తెలియజేశారు మొదటి రోజు చింతలపాలెం అమరవీరుల స్తూపం దగ్గర నుంచి బయలుదేరి హుజూర్నగర్ చింతలపూడి రాములు గారి స్థూపం వద్ద ముగుస్తుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్, హుజూర్నగర్ సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, AITUC జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు దొంతకాని సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు ఎల్లావుల రమేష్, మఠంపల్లి మండల కార్యదర్శి అమరారపు పున్నయ్య, కౌలు రైతుల రాష్ట్ర కార్యదర్శి కొప్పోలు సూర్యనారాయణ, సిపిఐ మండల నాయకులు గుండా రమేష్ హుజూర్నగర్ పట్టణ కార్యవర్గ సభ్యులు జక్కుల రమేష్, సోమగాని కృష్ణ, జెడ వెంకన్న. చెన్న గాని సైదులు. వెంకటేశ్వర్లు, ఎల్లావుల ఉమా, చక్రాల స్టాలిన్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు