దమ్మపేట, సెప్టెంబర్ 9 వై7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో రాజిని పోలమ్మ అనే కుటుంబం గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన కరెంట్ బిల్లు కట్టలేక విద్యుత్ శాఖ వారు సరఫరాను నిలిపివేశారు అప్పటినుంచి చిన్న పిల్లలతో చీకట్లోనే వుంటున్న విషయం తెలుసుకున్న మేము సైతం ఫౌండేషన్, రిపోర్టర్ గోరె సహకారంతో విద్యుత్ బకాయి చెల్లించి శనివారం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రాజిని పోలమ్మ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా చిమ్మ చీకట్లో ఉంటున్న మాకు మేము సైతం ఫౌండేషన్, గోరె సహకారం వల్ల ఈరోజు మా ఇంట్లో వెలుగులు నిండాయని వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు.
Post Views: 93









