E-PAPER

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం.. ఎమ్మెల్సీ కోటి రెడ్డి

మిర్యాలగూడ,అక్టోబర్ 03 వై7 న్యూస్

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి అన్నారు.

మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డులోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నియోజకవ్యాప్తంగా 72 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 18 లక్షలు, 96 వేలు, 500 రూపాయలు విలువైన చెక్కులను వారు పంపిణీ చేశారు..ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మాజీ వైస్ చైర్మన్ వీరకోటిరెడ్డి,చిర్ర మల్లయ్య యాదవ్, నంద్యాల శ్రీరామ్ రెడ్డి, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :