E-PAPER

2024 ఆగష్టు నెలలో 67 శాతం ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా – జిఎం శ్రీ దుర్గం రామచందర్

మణుగూరు,ఆగస్టు31 వై 7 న్యూస్;

తేదీ:31.08.2024న శనివారం నాడు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో జరిగిన ప్రెస్ మీట్ లో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ గారు మాట్లాడుతూ..

ఆగష్టు నెలలో మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 7 లక్షల 98 వేల 500 టన్నులకు గాను 5 లక్షల 36 వేల 474 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడమైనది. ఆగష్టు నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి 67 శాతం. అలాగే 01 ఏప్రిల్, 2024 నుండి 31 ఆగష్టు, 2024 వరకు ప్రోగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 49 లక్షల 88 వేల టన్నుల లక్ష్యానికి గాను 46 లక్షల 51 వేల 245 టన్నులు సాధించడం జరిగింది అనగా 93 శాతం సాధించడం జరిగింది.

ఆగష్టు నెలలో మణుగూరు ఏరియా 6 లక్షల 95 వేల 105 టన్నులను రవాణా చేయటం జరిగింది. అలాగే 01 ఏప్రిల్, 2024 నుండి 31 ఆగష్టు, 2024 వరకు ప్రోగ్రెస్సివ్ గా 46 లక్షల 49 వేల 315 టన్నులు రవాణా చేయడం జరిగింది.

ఆగష్టు నెలలో ఓవర్ బర్డెన్ డిపార్ట్ మెంటల్ గా 11 లక్షల క్యూబిక్ మీటర్లకు లక్ష్యానికి గాను 81 % తో 8 లక్షల 87 వేల క్యూబిక్ మీటర్లు తీయటం జరిగింది. అలాగే 01 ఏప్రిల్,2024 నుండి 31 ఆగష్టు, 2024 వరకు ప్రోగ్రెస్సివ్ గా 66 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 48 లక్షల 88 వేల క్యూబిక్ మీటర్లు అనగా 74% ఓబి వెలికి తీయడం జరిగింది.

పదవి విరమణ/మెడికల్ invalidation/death అయిన ఉద్యోగులకు ఈ క్రింది విధంగా చెల్లింపులు ఆగష్టు, 2024 మాసములో జరిగినవి అని తెలిపారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News