అశ్వాపురం,ఆగస్టు03(వై 7 న్యూస్ );భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గద్దల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాడ్లడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అసంపూర్తిగా ఉన్నదని, ఏ డిపార్ట్ మెంట్ నుండి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారనేది క్లారిటీ లేకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వంమోసం చేస్తుందని, జాబ్ క్యాలెండరు పై పూర్తి క్లారిటీ ఇవ్వాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు నజీర్ షోను, రసాల రమేష్, పిట్టా శ్రీను, బాగావత్ సతీష్, మామిడాల శివ, కొమ్ము రాంబాబు, గద్దల శ్రీను, పిట్ట సతీష్, ప్రేమ్ కుమార్, సాయి, నాండ్రు సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 144