కరకగూడెం, ఆగస్టు 03(వై 7న్యూస్);భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేస్తుందని, గతంలో రుణమాఫీ అయిన వారికి మరల రుణమాఫీ అవుతున్నాయని , గతంలో నష్టపోయిన రైతుకి న్యాయం జరగడం లేదని ,గత ప్రభుత్వంలో రెండు లక్షల 30000 ఉంటే ఆ ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీ అయినవని, లక్ష 30 వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఆపుతున్నదని అన్నారు ఎన్నో అంచనాలతో ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని రైతు సోదరులు భావించారు కానీ చిన్న రైతులైనటువంటి వారికి 30000, 80000 తీసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వం డేటా విషయంలో సక్రమంగా నిర్వర్తించడం లేదని ఇప్పటికైనా అటువంటివారిని గుర్తించి రుణమాఫీ విషయంలో న్యాయం చేయాలని, రైతుకి అప్పుడే ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుందన్నారు ప్రజల అవసరాలను గుర్తించి రుణ విముక్తులు చేయాలని రైతు మాఫీ కాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు కనీసం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు చెప్పడం లేదన్నారు . వ్యవసాయం ప్రారంభం అయ్యి రెండు నెలలుగా కావస్తున్న రైతు భరోసా పూసే లేదని అందరి దృష్టిని మరలించి రుణమాఫీ పేరుతో దృష్టిమర్లించడం జరిగిందన్నారు. అది కూడా క్షేత్రస్థాయిలో జరగడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి అధికారుల దగ్గర డేటాని తీసుకొని రైతు సోదరులందరికీ న్యాయం చేయగలరని రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చందా మధు ప్రభుత్వాన్ని కోరారు.









