E-PAPER

జూలై నెలలో 106 శాతం ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా; జిఎం దుర్గం రామచందర్

మణుగూరు;

బుధవారం నాడు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో జరిగిన ప్రెస్ మీట్ లో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ… జులై నెలలో మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 7 లక్షల 98 వేల 500 టన్నులకు గాను 8 లక్షల 46 వేల 563 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినది అని అన్నారు. జులై నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి 106 శాతం అని ,అలాగే 01 ఏప్రిల్, 2024 నుండి 31 జూలై, 2024 వరకు ప్రొగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 41 లక్షల 89 వేల 500 టన్నుల లక్ష్యానికి గాను 41 లక్షల 23 వేల 374 టన్నులు సాదించ్చినదని , అనగా 98 శాతం సాధించడం తెలిపారు.

జూలై నెలలో మణుగూరు ఏరియా 8 లక్షల 27 వేల 963 టన్నులను రవాణా చేయటం జరిగింది. అలాగే 01 ఏప్రిల్, 2024 నుండి 31 జులై, 2024 వరకు ప్రోగ్రెస్సివ్ గా 39 లక్షల 74 వేల 101 టన్నులు రవాణా చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు..

జూలై నెలలో ఓవర్ బర్డెన్ డిపార్ట్ మెంటల్ గా 11 లక్షల క్యూబిక్ మీటర్లకు లక్ష్యానికి గాను 54% తో 5 లక్షల 92 వేల క్యూబిక్ మీటర్లు తీసారన్నారు.. అలాగే 01 ఏప్రిల్, 2024 నుండి 31 జూలై, 2024 వరకు ప్రొగ్రెస్సివ్ గా 55 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 40 లక్షల 4 వేల క్యూబిక్ మీటర్లు అనగా 73 % ఓబి వెలికి తీయడం జరిగింది అని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News