E-PAPER

గట్టు మైసమ్మ అమ్మవారి జాతరకు పోటెత్తిన భక్తులు

బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందరర్భంగా బిజెపి నాయకులు గల్లి పెద్దలు కిసాన్ గల్లి వాసులు , బట్టి గల్లి వాసులు, పట్టణ సీఐ రాజారెడ్డిలు పాల్గొన్నారు. బోనం కుండలతో అమ్మవారి చెంతకు చేరుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మైసమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో హజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు, ప్రముఖులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News