భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పై శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థుల మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి విష్ణు పరిస్థితి విషమించడంతో, గమనించిన విద్యార్థులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించిన అనంతరం విష్ణు మృతి చెందినట్లు తెలిపారు.కాగా గతంలో పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా స్నేహితులు చెప్పుకుంటున్నారు.ఈ ఘటనపై పాల్వంచ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post Views: 1,733









