ఎర్రంపేట గ్రామం లో ఎన్నికల ప్రచారం..
చింతూరు,( వై7 న్యూస్ తెలుగు), అక్టోబర్ 28: చింతూరు -2 ఎంపీటీసీ అభ్యర్థిగా చిచ్చడి మురళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత తన లక్ష్యమని అన్నారు . భవిష్యత్తు లో గ్రామ అభివృద్ధి అవసరమని మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వైస్సార్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి సవలం అమల, మండల పార్టీ కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మేడేపల్లి శ్రీ సుధాకర్ (చిన్ని ), వాణిజ్య విభాగం అధ్యక్షులు కోట్ల కృష్ణ, పార్టీ యూత్ కన్వినర్ మడివి రాజు, స్థానిక మాజీ సర్పంచ్ కారం కన్నారావు, యువజన నాయకులు కారం సాయి , మిడియం లచ్చు దొర, పాండ్రు మహేష్, మోసం గాంధీ,ఇళ్ల మురళి,కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








